పునాదులులేని చదువులతో విసిగి వేసారిన తల్లిదండ్రులు
భావి భారత పౌరులకు చదువు నేర్పే అధ్యాపకులారా !

మెజారిటీ విద్యార్థులు తప్పుల్లేకుండా వ్రాయటం, చదవటంలో వెనకబడి, కొందరు చదువు మధ్యలోనే మానేస్తూ, ఇంకా కొందరు పై చదువుల్లో డిగ్రీలు, మార్కులకే పరిమితమై చదువుకుతగ్గ ఉద్యోగం దొరకని దురవస్థలో ఉన్నారు.

పునాదులు లేని భవనం ఎన్ని అంతస్తులు కడితేనేమి?

చదువుకు మూలం భాష
భాషకు మూలం అక్షరాలు లేక అల్ఫబెట్
అక్షరాలు లేకుంటే భాష లేదు
అక్షరాలు నేర్చుకొనే దశలోనే,
బడిలో చేరిన మొదటి రెండు, మూడు సంవత్సరాల్లోనే
అంటే శిశు తరగతిలోనే గట్టి పునాది వేయాలి

అక్షరాలను వందలు వేల సార్లు చదువుతూ దిద్దుతూ
దిద్దుతూ చదువుతూ అక్షరాల్లో పరిపూర్ణత సాధించడం కోసం
మాతృభాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాషల్లో
లెక్కల కోసం ఎక్కాలతో వేరు వేరుగా
గాడాల్లో అక్షరాలతో పలకలాంటి పరికరం తయారు చేశాం.

ఇది పాతకాలంలోని పలక కంటే భిన్నమైంది
ప్రాక్టిస్ మేక్స్ పర్ఫాక్ట్
అభ్యాసంతో పరిపూర్ణత వస్తుందనే విషయం మనందరికి తెలుసు
పిల్లల మెదళ్ళలో నిక్షిప్తమౌతుంది
చేతికి వేగంగా, చక్కగా రాయటం అలవడుతుంది
కంప్యూటర్ పరిభాషలో హార్డ్ డిస్క్లోలో నిక్షిప్తమై
ప్రింటర్ వేగంగా, చక్కగా ప్రింట్ చేస్తుంది

రాయటం, చదవటంలో గట్టి పునాది పడుతుంది
పిల్లలు చదువుతూ దిద్దటం , దిద్దుతూ పలకటాన్ని
ఉపాధ్యాయులు అజమాయిషి మాత్రమే చేయవలసి ఉంటుంది
బలపంతో పలకపై పెట్టించే సమయం మిగులుతుంది

విరిగేదీ తరిగేదీ , తడిసేదికాదు
కాగితం ఖర్చుండదు , పెన్సిల్ మాత్రమే ఖర్చవుతుంది
కాగితం కోసం చెట్లు నరకటం తగ్గుతుంది

అక్షరాల్లో పునాది పడితే పుస్తకాలు చదవగలరు
చదవటం కోసం పై 3 భాషల్లో ప్రాథమిక విషయాలతో
“పునాదిపుస్తకం, బున్యాదికితాబ్, ఫౌండేషన్బక్” పేరుతో
పెద్ద బాలశిక్షలాంటి పుస్తకం
పెన్సిల్తో కాగితంపై రాయటం కోసం 3 భాషలతో కూడిన
కరడాల కాపితో అరు ( 6 ) పలకలు కలిపి —

గబగబామెట్లెక్కి జారిపడకుండా ఒకటి తరువాత ఒకటి క్షుణ్ణంగా నేర్పటం కోసం తెలుగు, హింది, ఇంగ్లీషు భాషల్లో 1, 2 పేజీలుగల మూడు పలకలతో మొదటి భాగం

తెలుగు, హిందీ భాషల్లో 3, 4 పేజీలుగల రెండు పలకలు, లెక్కల కోసం ఎక్కాలతో 1, 2 పేజీలుగల ఒక పలకతో కలిపి మూడు పలకలతో రెండవభాగం

ఈ రెండుభాగాల్లో పరిపూర్ణత సాధించిన తరువాత చదవటం కోసం "పునాదిపుస్తకం, బున్యాదికితాబ్, ఫౌండేషన్ బుక్" పెన్సిల్తో కాగితంపై రాయటం కోసం పైన చెప్పిన మూడు భాషల్లో కరడాల కాపితో కలిపి మూడవభాగం

పై మూడు భాగాలను ఎలా, ఎప్పుడెప్పుడు వాడాలో తెలియచేస్తూ మూడు సంచులతో నింపిన "అక్షరాభ్యాస్” కిట్ అందిస్తున్నాం.

ఏ భాషకు ఆ భాష విడివిడిగా నేర్చుకునే లేక నేర్పే వారికోసం

1. తెలుగులో 'అ' నుండి 'క్ష’ గుణింతం దాకా రెండు, ఎక్కాల పలకతో కలిపి మూడు పలకలు;

2. హిందీలో ‘अ’ నుండి ‘क्ष’ గుణింతం దాకా రెండు , ఎక్కాల పలకతో కలిపి మూడు పలకలు,

3. ఇంగ్లీషు ఒకటి , ఎక్కాలతో ఒకటి కలిపి రెండు పలకలు ;

4. పునాదిపుస్తకం , కరణాల కాపితో కలిపి రెండు వేర్వేరుగా నాలుగు సంచుల్లో అందిస్తున్నాం .

“అక్షరాభ్యాస్" తో పిల్లలేకాదు చదువురాని పెద్దలు కూడా సులభంగా నేర్చుకోవచ్చు .

PARENTS WORRIED OF FOUNDATION LESS EDUCATION
TEACHERS NURTURING FUTURE CITIZENS OF INDIA...

Majority of the students are lagging behind in reading and writing, dropping out in the middle and the continuing are obtaining marks and degrees, lacking quality of employability.

What is the use of constructing a building without Foundation?

Language is the base of Education Alphabet is the base of Language without letters of Alphabet there is no language
within two to three years of joining in the school proper Foundation should be laid in the children in reading and writing of letters of Alphabets perfectly.

To lay proper foundation in reading and writing of letters of alphabets, we have prepared slates with letters in grooves in Regional, National and International Languages and Multiplication tables.

They are different from the present slates. We all know that, Practice makes perfect. Letters in the grooves of slates can be traced with pencil by the children by reading and writing, writing and reading hundreds and thousands of times gets stored in their brains, hand gets habituated to write speedily In computer language letters enter the hard disc and the printer prints speedily.

Teachers have to do supervision only Precious time of writing of letters with chalk by the teachers on each slate of the children is saved. It is unbreakable, non-soaking and durable less expensive and paper less. No felling of trees for paper. When foundation is laid in reading and writing of letters of Alphabets, one can read books and write without mistakes.

After learning to read and write the letters perfectly, A book to read by name “Punadipustakam, Bunyadikitab, Foundation book” in 3 languages Telugu, Hindi and English with basic worldly knowledge and a Copy Writing Book in 3 languages to practice writing on paper with pencil, with six(6) slates with letters in grooves, “Aksharabhyas” Kit is unveiled.

Not to get confused, this kit contains three parts in three bags separately with guidelines, to introduce them to the children one after the other, only after they learn each of them perfectly.

First Part contains 3 slates with 1 and 2 pages of letters in grooves in Telugu, Hindi and English; Second Part contains 3 slates out of which 2 slates with 3 & 4 pages in Telugu and Hindi and one slate of Multiplication Tables with 1 & 2 pages and the Third Part contains “Punadipustakam, Bunyadikitab, Foundation book” and a Copy Writing Book to practice on paper with pencil, both in three languages, making the children self-confident with perfection in reading and writing of languages, who excel in future without worry to the parents.

For those who want to learn or teach each language exclusively
3 slates-2 slates from "" to "క్ష" in Telugu and one slate of tables.
3 slates- 2 slates from "अ" to  "क्ष" barahkhadi in Hindi and one slate of Tables.
2 slates- 1 slate of English and one slate of Tables.
2 books- “Foundation book” for reading and a “Copy Writing book”; are provided in 4 bags separately.

Uneducated elders also can learn easily with “Aksharabhyas”.